గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం

Digital Marketing Agency

గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం

GARDNER’S MULTIPLE INTELLIGENCE THEORY

హోవర్డ్ గార్డెనర్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సంజ్ణానం, విద్యా విభాగంలో ఆచార్యులు.వీరు 1983వ సంవత్సరంలో

“Frames of Mind: The Theory of Multiple Intelligence.”

అనే పుస్తకంలో గార్డెనర్ ‘ప్రజ్ఞ ‘ యొక్క కొత్తనిర్వచనాన్ని,సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞలు ఎనిమిది(8) రకాలుగా నిర్వచించాడు.

అవి ,
1)భాషా ప్రజ్ఞ (WORD INTELLIGENCE) ,
2)తార్కిక-గణితశాస్త్ర ప్రజ్ఞ (NUMBER INTELLIGENCE) ,
3)ప్రాదేశిక ప్రజ్ఞ (PICTURE INTELLIGENCE) ,
4)శారీరక-గతి సంవేదన ప్రజ్ఞ (BODY INTELLIGENCE) ,
5)సంగీత ప్రజ్ఞ (MUSIC INTELLIGENCE) ,
6)పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ (SOCIAL INTELLIGENCE) ,
7)వ్యక్తంతర్గత ప్రజ్ఞ (SELF INTELLIGENCE) ,
8)సహజ ప్రజ్ఞ (NATURE INTELLIGENCE).

ఈ ఎనిమిది రకాల ప్రజ్ఞలే కాకుండా , ఆధ్యాత్మిక ప్రజ్ఞ , అస్థిత్వ ప్రజ్ఞ , నైతిక ప్రజ్ఞ అనే మరో మూడు రకాల ప్రజ్ఞలను కూడా గార్డెనర్ ప్రతిపాదించాడు.

పైన పేర్కొన్న ఏ ప్రజ్ఞ అయినా ఇతర ప్రజ్ఞల నుంచి చాలా వరకు స్వతంత్రంగా పనిచేయగల శక్తి ఉంటుంది.ఉదాహరణకు వ్యక్తి మెదడులోని ఏదైన భాగం నశించినప్పుడు, ఆ భాగానికి సంబంధించిన సామర్థ్యంపై మాత్రమే ప్రభావం చూపించి , మిగతా సామర్థ్యాలపై ఎటువంటి ప్రభావం చూపించదు. కొన్ని రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచే వ్యక్తులు కూడా గార్డెనర్ సిద్ధాంతానికి ఉదాహారణ.

ఏదైనా రంగంలో మనం ఉన్నత నిష్పాదన సాధించాలంటే వివిధ ప్రజ్ఞల కలయిక అవసరం.ఉదాహరణకు పియానో వాయిద్యంలో, “సంగీత ప్రజ్ఞ”తో పాటు గణనను అర్థం చేసుకోవడానికి “తార్కిక – గణిత శాస్త్రప్రజ్ఞ” , శిక్షణకు ప్రతిస్పందించడానికి “భాషా ప్రజ్ఞ” , కీ బోర్డు వాయించడానికి “ప్రాదేశిక ప్రజ్ఞ” ,ప్రేక్షకులకు ప్రతిస్పందించడానికి “పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ” , భావయుక్తంగా వాయించడానికి ” వ్యక్తంతర్గత ప్రజ్ఞ ” అవసరం.